Explore Projects Across Khammam

bhadrachalam

రామాలయంలో భక్తుల సందడి

భద్రాచలం టౌన్, జూలై10: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుసగా సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతా ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, 77 మంది కల్యాణ దాతలు పాల్గొన్నారు. అంతేకాకుండా దేవస్థానంలో జరుగుతున్న నిత్యన్నదాన కార్యక్రమంలో 928 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

అన్నదానానికి రూ.50 వేలు విరాళం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి రాజమండ్రి లాలాచెరువుకు చెందిన మేడవరపు చంద్రమౌళి, రమ దంపతులు రూ.50వేలు విరాళాన్ని ఆలయ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు. ఆదివారం భద్రాచలం వచ్చిన వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విరాళాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు.

Leave a Reply

https://indexsy.com/