భద్రాద్రి రామయ్యకు రూ.5 లక్షల విరాళం
భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ విశిష్టతను ప్రవచనం చేసి నామార్చనలు పటించారు. నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించి దర్బారు సేవను వేడుకగా జరిపారు. ఆంజనేయస్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. వరంగల్ జిల్లా డోర్నకల్‌కు చెందిన వెంకటరమణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున భక్తులు రాములోరిని దర్శించుకుని పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ట్రస్ట్ నిర్వాహకులు రూ.5 లక్షల చెక్కును అన్నదానం నిమిత్తం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులకు ఆలయం తరఫున తీర్థ¹్ధ ప్రసాదాలు అందించారు. ఉపప్రధానార్చకులు రామస్వరూప్, వేద పండితులు ప్రసాద అవధాని, పీఆర్వో సాయిబాబు, చిట్టిబాబు పాల్గొన్నారు.