ఘనంగా రామానుజ జయంత్యోత్సవం
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే : వికాస తరంగణి ఆధ్వర్యంలో శ్రీరామానుజ సహస్రాబ్ధి జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని మామిళ్లగూడెం శ్రీలక్ష్మీపద్మావతి వేంకటేశ్వర ఆలయం నుంచి ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వికాస తరంగిణి అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు జయప్రద, పావని, విఎన్.అచార్యులు, ఉషారాణి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.