కేటీపీఎస్‌లో ఆల్‌టైం రికార్డు సృష్టించిన ఐదో యూనిట్
పాల్వంచ, జూలై 4 : కేటీపీఎస్ ఓఅండ్‌ఎం బీస్టేషన్ 5వ యూనిట్ ఆల్‌టైం రికార్డును సృష్టించింది. ఈ సందర్బంగా కేటీపీఎస్ ఇంజనీర్లు సంబురాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ గత 126 రోజుల నుంచి నిరాటంకంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. గతంలో 2010లో కూడా 125 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఆరేళ్ల తరువాత తిరిగి ఈ యూనిట్ నిరాటంకంగా ఉత్పత్తి చేపట్టడం హర్షణీయం. ఈ కార్యక్రమంలో ఐదో యూనిట్ ఎస్‌ఈలు రవీంద్రకుమార్, భీమ్యా, గిరి, కొమరయ్య, కృష్ణయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు.