Explore Projects Across Khammam

24-06-16-01 khammamrealestate.com

అన్ని రంగాల్లో అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు

అన్ని రంగాల్లో అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు
పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని జడ్పీ అధ్యక్షురాలు జి.కవిత అన్నారు. గురువారం పాల్వంచ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆమె కేటీపీఎస్‌ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా 600 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్టు, పాఠశాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు ప్రహరీలు, శిథిలావస్థలో ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 కోట్లమొక్కల్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని విద్యావ్యవస్థ సక్రమంగా లేదన్నారు. కేటీపీఎస్‌ ఏడోదశలో స్థానికులకు అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తునట్లు ఆమె పేర్కొన్నారు. జడ్పీలో నిధుల కొరత ఉందన్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు బరపటి వాసుదేవరావు, తెరాస నాయకులు మేడిద సంతోష్‌, కాంపల్లి కనకేష్‌, మదార్‌, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

https://indexsy.com/