
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచ రూరల్;ప్రముఖ పర్యాటక కేంద్రమైన కిన్నెరసానిలో ఆదివారం సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వారే కాకుండా వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి తరలివచ్చి కిన్నెరసాని అందాలను తిలకించారు. భద్రాచలం, తిరువూరు, తల్లాడ, నర్సంపేట తదితర ప్రాంతాలను నుంచి వచ్చిన వారు డీర్‌పార్కు, ఫెన్సింగ్ వద్దకు వచ్చిన జింకలతో సరదాగా గడిపారు. బోటు షికారు చేసేందుకు పొటీపడ్డారు. డ్యామ్‌పైకి వెళ్లి నిండుగా ఉన్న కిన్నెరసానిలోకి చేరిన కొత్త నీటిని తిలకించి సరదాగా గడిపారు. డ్యామ్‌పై ఫుడ్‌కోర్టు మూసివేసి ఉండటంతో సందర్శకులు అసౌకర్యానికి గురయ్యారు. సుమారు రూ. 7వేలు ఆదాయం వచ్చింది.