పచ్చదనానికి జయహో! ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో నేడు 2 వేల మొక్కలు నాటనున్న అటవీశాఖ
భద్రాచలం, న్యూస్‌టుడే: పచ్చదనం పరిఢవిల్లాలని ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో వన భారతి జన హారతి పేరిట చేపట్టిన మహోద్యమానికి వూరూరా కదలిక వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు స్ఫూర్తి పొందుతున్నాయి. భద్రాచలం డీఎఫ్‌వో శివాల రాంబాబు సూచనలతో చర్ల రేంజ్‌లో నేడు ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో 2 వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేపట్టారు. చర్ల రేంజ్‌లోని సూరవీడు బీట్ వెంకటాపురం మండలంలో ఉంది. ఆ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాన్ని ఇప్పటికే గుర్తించారు. భద్రాచలం ఏఎంసీ కాలనీ నుంచి రకరకాల మొక్కలను ప్రత్యేక వాహనాలతో శనివారం తరలించినట్లు అటవీ అధికారులు కృష్ణయ్య, డి.లక్ష్మణ్ తెలిపారు. అక్కడి రేంజర్ బన్సీలాల్, ఎఫ్‌ఎస్‌వో సుజన్‌కుమార్ మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు సిబ్బంది తెలిపారు.