కల్లూరు మండలాన్ని దత్తత తీసుకున్న ఎంపీ
ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలాన్ని దత్తత తీసుకున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కల్లూరు మండలంలో 3 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా కల్లూరు మండల స్థాయి అధికారులతో శనివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మండల నోడల్ అధికారి అశోక్‌కుమార్, ఎంపీడీఓ, సామాజిక అటవీ విభాగం అధికారి, వివిధ శాఖల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.