భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, అంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు మంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భద్రాచలం నుంచి అశ్వరావుపేటలో జరుగుతున్న ఐటిడీఏ పాలక మండలి సమావేశానికి మంత్రులు బయలుదేరి వెళ్లారు.