భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలం, న్యూస్‌టుడే : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు. పవళింపు సేవ జరపలేదు. బేడా మండపంలో నిత్య కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్బారు సేవ చూడ ముచ్చటగా జరిగింది. తూ.గో.జిల్లా చింతూరు ఏఎస్పీ శ్వేత ఆలయాన్ని దర్శించుకోవడంతో పీఆర్వో సాయిబాబు స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం అందించారు. మూలవిరాట్‌తో పాటు అనుబంధ కోవెళ్లలో ఈమె ప్రత్యేక పూజలు జరిపించారు. నేడు శుక్రవారోత్సవం జరుగుతుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు.