మిషన్ కాకతీయలో ఖమ్మం జిల్లా ఫస్ట్: తుమ్మల
ఖమ్మం: మిషన్ కాకతీయ పనుల్లో ఖమ్మం జిల్లాది మొదటి స్థానం అక్రమించిందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మరో రెండు నెలల్లో సాగు నీరందిస్తామన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరగాలని లేదా ఉన్న హైకోర్టును ఇరు రాష్ట్రాలకు విభజించి విధులు నిర్వహించాలని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.