Explore Projects Across Khammam

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల విస్తరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల విస్తరణ
మంత్రి లక్ష్మారెడ్డి
వైద్య విభాగం, ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామనిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ జి. పాపాలాల్‌తో కలిసి ఆయన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల విభాగాలను సందర్శించి వైద్యసేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ట్రామా కేర్‌ సెంటర్‌, ఎంసీహెచ్‌ భవనాలను సందర్శించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనందవాణి, అసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

https://indexsy.com/