చింతకాని: ‘వనభారతి-జనహారతి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ కనీసం ఒక్క మొక్క నాటాలని ఎంపీడీవో నవాబ్ పాషా సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి సామ్రాజ్యం, జడ్పీటీసీ సభ్యురాలు శిరీషా, డీఎల్‌పీవో రామయ్య తదితరులు పాల్గొన్నారు.