పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.16 కోట్లు
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: జిల్లాలో గోదావరి పుష్కార ఘాట్‌ల నిర్మాణానికి రూ.16 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. భద్రాచలం విస్తా సముదాయం వద్ద నిర్మాణానికి రూ.8.1 3కోట్లు, బూర్గంపాడు మండలం మోతెకు రూ.1.62 కోట్లు, వెంకటాపురం మండలం రామచంద్రపురానికి రూ.92 లక్షలు, దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నిర్మాణానికి రూ.4.3 1కోట్లు, మణుగూరు మండలం రామానుజవరం వద్ద నిర్మాణానికి రూ.1 కోటి విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.